ఆత్మహత్యలకు ఇంటర్ ఫలితాలే కారణమని చెప్పలేం

ఆత్మహత్యలకు ఇంటర్ ఫలితాలే కారణమని చెప్పలేం
  • తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీం వ్యాఖ్య
  • బాలల హక్కుల సంఘం పిటిషన్ తిరస్కరణ

న్యూఢిల్లీ: తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు పరీక్ష ఫలితాలే కారణమని చెప్పలేమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ ఏడాది ఫలితాలు విడుదలయ్యాక కరెక్షన్లో తప్పులు జరిగి, భారీగా మార్కులు తప్పుగా రావడంతో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని బాలల హక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే ఈ పిటిషన్ పై విచారణ చేపట్టలేమని సుప్రీం కోర్టు సోమవారం నాడు స్పష్టం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలకు ఇంటర్ ఫలితాలు వచ్చిన తీరే కారణమని చెప్పలేమని పేర్కొంది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం చెప్పింది. ఇదే తరహా పిటిషన్లను గతంలోనూ కొట్టివేసినట్టు సుప్రీంకోర్టు తెలిపింది.