సత్యేందర్ జైన్ బెయిల్​పై తీర్పు రిజర్వ్

సత్యేందర్ జైన్ బెయిల్​పై తీర్పు రిజర్వ్

న్యూఢిల్లీ :  మనీ లాండరింగ్‌‌‌‌ కేసులో ఆమ్‌‌‌‌ ఆద్మీ పార్టీ(ఆప్‌‌‌‌) నేత సత్యేందర్‌‌‌‌ జైన్‌‌‌‌ రెగ్యులర్‌‌‌‌ బెయిల్‌‌‌‌ పిటిషన్‌‌‌‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్‌‌‌‌ చేసింది. బుధవారం సుప్రీంకోర్టులో జైన్‌‌‌‌ తరఫున సీనియర్‌‌‌‌ అడ్వొకేట్​ అభిషేక్‌‌‌‌ సింఘ్వీ, ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌తరఫున అదనపు సొలిసిటర్‌‌‌‌ జనరల్‌‌‌‌ ఎస్‌‌‌‌వీ రాజు వాదనలు వినిపించారు. వారి వాదనలు విన్న జస్టిస్​ బేలా ఎం త్రివేది, జస్టిస్​ పంకజ్‌‌‌‌మిథాల్‌‌‌‌లతో కూడిన బెంచ్​తీర్పును రిజర్వ్‌‌‌‌లో ఉంచింది. 

మనీ లాండరింగ్‌‌‌‌ కేసులో 2022, మే 30న ఎన్​ఫోర్స్​మెంట్​డైరెక్టరేట్​(ఈడీ) జైన్​ను అరెస్టు చేసింది. తనకు తెలిసిన నాలుగు కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడ్డాడని ఆరోపించింది. అయితే, ట్రీట్​మెంట్​ కోసం 2023, మే 26న జైన్‌‌‌‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దానిని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చింది. ఇదే కేసులో తన రెగ్యులర్ బెయిల్ పిటిషన్​ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చడాన్ని  జైన్ సుప్రీంకోర్టులో సవాల్​ చేశారు.