ఆర్టీసీ బస్సుల ఫిట్నెస్పై రీ ఇన్స్పెక్ట్ చేయాలి

ఆర్టీసీ బస్సుల ఫిట్నెస్పై రీ ఇన్స్పెక్ట్ చేయాలి
  • చేవెళ్ల ఘటనపై సుప్రీంకోర్టు రోడ్​సేఫ్టీ కమిటీ సమీక్ష

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఆర్టీసీ బస్సుల ఫిట్ నెస్ పై మరోసారి తనిఖీలు చేయాలని సుప్రీంకోర్టు రోడ్​సేఫ్టీ కమిటీ ఆర్టీఏ అధికారులను ఆదేశించింది. అలాగే ప్రైవేట్ బస్సులు, కమర్షియల్​వాహనాలను తనిఖీ చేసి ఫిట్ నెస్​లేకపోతే సీజ్ చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని రోడ్ సేఫ్టీ కమిటీ చైర్మన్​జస్టిస్ అభయ్​మనోహర్​సప్రే, సభ్యులు సంజయ్ బందోపాధ్యాయ్ గురువారం హైదరాబాద్​కు విచ్చేశారు. 

ఈ సందర్భంగా ఇటీవల చేవెళ్లలో జరిగిన ఘోర ప్రమాద ఘటనపై వారు సమీక్షను నిర్వహించారు. ఈ సమావేశంలో సైబరాబాద్​ కమిషనర్​అవినాశ్ మహంతి, ట్రాన్స్​పోర్ట్ కమిషనర్ ఇలంబర్తి, అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, మైనింగ్​డైరెక్టర్​భావేశ్ మిశ్రా, జాయింట్​ ట్రాన్స్​పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర గౌడ్, ఆర్టీసీ, నేషనల్​హైవే అథారిటీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కమిటీ.. చేవెళ్ల ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నది. ఆర్టీసీ బస్సులకు రీ ఫిట్ నెస్​నిర్వహించాలని, ఫిట్ నెస్​లేని అన్ని రకాల వాహనాలను సీజ్​ చేయాలని ఆదేశించింది. ప్రతి వాహనం ఇన్సూరెన్స్​, పర్మిట్, ఫిట్ నెస్​సర్టిఫికెట్ లను కలిగి ఉండేలా రవాణాశాఖ చర్యలు తీసుకోవాలని వెల్లడించింది.