హెచ్ఎండీఏ శంషాబాద్ భూముల కేసులో జోక్యం చేసుకోలేం

హెచ్ఎండీఏ శంషాబాద్ భూముల కేసులో జోక్యం చేసుకోలేం
  • సుప్రీం కోర్టులో పిటిషనర్ చుక్కెదురు

న్యూఢిల్లీ, వెలుగు:  హెచ్ఎండీఏ కి సంబంధించి శంషాబాద్ లో ఉన్న భూమి తనదే అంటూ ఓ వ్యక్తి దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. శంషాబాద్ లో ఉన్న హెచ్ఎండీఏ భూములు తమవే అంటూ యాహియ ఖురేషి అనే వ్యక్తి పలు నిర్మాణాలు చేపట్టారు.

ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరగా.. హైకోర్టు హెడ్ఎండీఏకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఖురేషీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ సోమవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మల ద్విసభ్య ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరపు సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ, తెలంగాణ ప్రభుత్వం తరపు సీనియర్ అడ్వకేట్ సిద్దార్థ లూత్ర, తెలంగాణ స్టాండింగ్ కౌన్సిల్ దేవినా సెహ్ గల్ లు హాజరయ్యారు.

మున్సిపల్​ చీఫ్​సెక్రటరీ,​ హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఎం.దాన కిషోర్ పర్యవేక్షణలో హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు సోమవారం సుప్రీంకోర్టుకు హాజరై భూముల వివరాలను సుప్రీం కోర్టుకు అందజేశారు. ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. వివాదస్పద ప్రశ్నలపై అఫిడవిట్ లతో డిసైడ్ చేయాలేమని.. హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొందని బెంచ్ దృష్టికి తెచ్చారు. ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం.. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించలేదని అభిప్రాయపడింది. అలాగే సివిల్ సూట్ దాఖలు చేసుకోవడానికి అనుమతి ఇస్తూ... పిటిషన్ ను డిస్మిస్​ చేసింది.