రాజస్థాన్ ​సర్కారుపై సుప్రీం ఫైర్

రాజస్థాన్ ​సర్కారుపై సుప్రీం ఫైర్
  • కరోనా ఎక్స్​ గ్రేషియాను సరిగ్గా ఇవ్వకపోవడంపై అసహనం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి బారినపడి చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్​గ్రేషియా అందించే విషయంలో రాజస్థాన్​ సర్కారు తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. రాజస్థాన్​ ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్​పై అసంతృప్తి వ్యక్తంచేసింది. పూర్తి వివరాలతో అఫిడవిట్​దాఖలు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి నేతృత్వంలోని బెంచ్​ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

‘‘కరోనా మహమ్మారితో చనిపోయిన వారి కుటుంబాలను దయతో చూడాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. వాటిని అమలు చేస్తామని మీరు గతంలో కూడా హామీ ఇచ్చారు. కానీ అమలు చేయలేదు. రాజస్థాన్​రాష్ట్రం చేసేది దానం కాదు” అని పేర్కొంది. కరోనా ఎక్స్​గ్రేషియాకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను రాజస్థాన్  ప్రభుత్వం అమలు చేయట్లేదంటూ అడ్వొకేట్ గౌరవ్​పిటిషన్​దాఖలు చేశారు.