మీకు జైలే కరెక్ట్ !..బాలీవుడ్ నటుడు రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై సుప్రీం కోర్టు ఫైర్

మీకు జైలే కరెక్ట్ !..బాలీవుడ్ నటుడు రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై సుప్రీం కోర్టు ఫైర్

న్యూఢిల్లీ: చెక్ బౌన్స్ కేసుల్లో కోర్టు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైన బాలీవుడ్ నటుడు రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆయన తీరును తప్పుబట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ‘మీ అహంకారాన్ని సరైన దారిలో పెట్టాలి, మీరు జైలులో ఉండడమే కరెక్ట్’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రైవేట్ సంస్థకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో గత నెలలో కోర్టు రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్​కు గడువు ఇచ్చింది. రూ.2 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. గడువు ముగిసినా రాజ్​పాల్ చెల్లింపులు చేయకపోవడంతో ధర్మాసనం మండిపడింది. 

రూ.50 లక్షల డీడీ ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉందని రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్ తరఫు న్యాయవాది తెలపగా.. ‘ఇది అసలైనదా.. కాదా..? మాకు ఎలా తెలుస్తుంది?’ అని బెంచ్ సందేహం వ్యక్తం చేసింది. మంగళవారంలోపు బకాయిలు చెల్లించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. 2010లో ఓ సినిమా కోసం తీసుకున్న రుణానికి సంబంధించి రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్ యాదవ్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆయనకు 3 నెలల జైలు శిక్షను ఖరారు చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంను ఆశ్రయించారు.