
కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రాజెక్టు పనులపై యధాతథ స్థితిని కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. మూడో టీఎంసీ పనులకు పర్యావరణ అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది.
ఎటువంటి అనుమతులు లేకుండానే కాళేశ్వరం మూడో టీఎంసీ విస్తరణ పనులు చేపడుతున్నారని కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ రెడ్డి సహా పలువురు నిర్వాసితులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ జేబీ పార్థీవాల బెంచ్ ఈ నెల 22న విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతోపాటు నిర్వాసితులకు పరిహారం పంపిణీలోనూ వివక్ష చూపుతోందని పిటిషనర్ తరుఫు లాయర్ వివరించారు. అయితే పునారావాసానికి సంబంధించి ఇప్పటికే అత్యధిక మందికి పరిహారం అందించామని ప్రభుత్వ తరుపు లాయర్ తెలిపారు.