‘ఓటుకు నోటు’ కేసు విచారణ..4 వారాలకు వాయిదా

‘ఓటుకు నోటు’ కేసు విచారణ..4 వారాలకు వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు : ‘ఓటుకు నోటు’ కేసును విచారించే ట్రయల్ కోర్టు పరిధిని సవాలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌పై విచారణను సుప్రీం కోర్టు నాలుగు వారాలు వాయిదా వేసింది. ట్రయల్ కోర్టు అధికార పరిధిని ప్రశ్నిస్తూ.. రేవంత్ వేసిన రివిజన్ పిటిషన్‌‌‌‌ను 2021 జూన్​లో తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. రేవంత్ రెడ్డి సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్ శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల బెంచ్​ విచారణ చేపట్టింది. తెలంగాణ స్టాండింగ్ కౌన్సిల్ కుటుంబ సభ్యుడు చనిపోవడంతో ఈ విచారణను వాయిదా వేయాలని ఆయన తరఫు అడ్వకేట్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. విచారణ ను తర్వాత చేపడ్తామని వెల్లడించింది.