ఆధార్తో ఓటర్ ఐడీ అనుసంధానం పిటిషన్పై రేపు విచారణ

ఆధార్తో ఓటర్ ఐడీ అనుసంధానం పిటిషన్పై రేపు విచారణ

న్యూఢిల్లీ : ఓటర్ ఐడీ కార్డులను ఆధార్తో అనుసంధించే చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేత రణ్దీప్ సుర్జేవాలా కోర్టును ఆశ్రయించారు. ఇది  రాజ్యాంగ విరుద్ధమని, వ్యక్తుల గోప్యత, సమానత్వం హక్కుల్ని కాలరాస్తోందని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపనుంది. 

ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్ డేటాను ఆధార్తో లింక్ చేసే ప్రాజెక్టు చేపట్టింది. దీనివల్ల ఒకే వ్యక్తి ఒకటికి మించి ఓట్లు నమోదుచేసుకోకుండా అడ్డుకోవచ్చని చెబుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎన్నికల చట్టంలో మార్పులు చేసింది. గతేడాది శీతాకాల సమావేశాల్లో ఎన్నికల సంస్కరణల బిల్లుకుఉభయసభల ఆమోదం లభించింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆధార్ ఓటర్ ఐడీ లింక్ చేయడం ద్వారా బోగస్ ఓట్లు పెరుగుతాయని అంటున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.