ఆరేళ్ల తర్వాత నోట్ల రద్దుపై విచారించనున్న సుప్రీంకోర్టు

ఆరేళ్ల తర్వాత నోట్ల రద్దుపై విచారించనున్న సుప్రీంకోర్టు

నోట్ల రద్దు విషయంపై ఆరేళ్ల తర్వాత సుప్రీం కోర్టు విచారణకు సిద్ధమైంది. బ్లాక్ మనీ నిర్మూలన కోసం రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఇవాళ విచారణ జరగనుంది. నోట్ల రద్దు నిర్ణయంపై రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు వాదనలు విననుంది. 2016 నవంబర్ 8న ప్రధాని మోడీ నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. తర్వాత కొన్నాళ్లకు కొత్త రూ.500 నోటుతో పాటు రూ.2 వేల నోట్లను కేంద్రం తీసుకొచ్చింది. అయితే సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనాలను ఇప్పటికే లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న నేపథ్యంలో ఈ నోట్ల రద్దుపై విచారణను కూడా దేశ ప్రజలు ప్రత్యక్షంగా చూడొచ్చు.  

దీనిపై కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తమ స్నేహితులకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా మోడీ ఈ నోట్ల రద్దును తీసుకొచ్చారని అప్పట్లో రాహుల్ గాంధీ అనేక సార్లు ఆరోపించారు. దీంతో నోట్ల రద్దుకు సంబంధించిన రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 58 పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే 2016 డిసెంబర్ 16నే సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. అయితే దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి విచారణ చేపట్టకపోవడం గమనార్హం.