'అగ్నిపథ్' పై పిటిషన్లు.. ఈ నెల 15న సుప్రీంకోర్టులో విచారణ

'అగ్నిపథ్' పై పిటిషన్లు..  ఈ నెల 15న సుప్రీంకోర్టులో విచారణ

రక్షణ బలగాల కోసం  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 'అగ్నిపథ్' రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లను జూలై 15న సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, ఎఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పథకాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో వివిధ పిటిషన్లు దాఖలయ్యాయి. దాఖలైన పిటిషన్లపై విచారణ జరపాలని కోరుతూ గతంలో కేంద్ర ప్రభుత్వం కేవియట్ దరఖాస్తును కూడా దాఖలు చేసింది.  అగ్నిపథ్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తమ వాదన వినాలని సుప్రీంకోర్టుకు కేంద్రం విన్నవించింది. సాయుధ బలగాల కోసం 'అగ్నిపథ్' రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను పునఃపరిశీలించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది హర్ష్ అజయ్ సింగ్ పిల్ దాఖలు చేశారు. కాగా జూన్ 14న కేంద్ర క్యాబినెట్ యువత కోసం అగ్నిపథ్ అనే మూడు సైనిక దళాలలో పనిచేయడానికి రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను ఆమోదించింది.  ఈ పథకం కింద ఎంపికైన యువకులను అగ్నివీర్ గా అని పిలుస్తారు. అయితే ఈ పథకానికి వ్యతిరేకంగా  బీహార్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, హర్యానా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ మొదలగు ఇతర రాష్ట్రాలలో యువకులు ఆందోళనలు మొదలయ్యాయి. పలు చోట్లల్లో  రైళ్లను తగలబెట్టారు.