సీఏఏ పిటిషన్లపై 19న విచారణ: సుప్రీం

సీఏఏ పిటిషన్లపై 19న విచారణ: సుప్రీం

న్యూఢిల్లీ: సీఏఏ అమలుపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. వాటిపై ఈ నెల 19న విచారణ చేపడతామని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన బెంచ్ శుక్రవారం తెలిపింది. సీఏఏ రాజ్యాంగ విరుద్ధమంటూ కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) పార్టీ సహా మరికొన్ని సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి. 

తాజాగా సీఏఏ అమలుకు కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వడంతో, ఆ రూల్స్ ను వ్యతిరేకిస్తూ ఇంటరిమ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఐయూఎంఎల్ తరఫున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదిస్తూ.. ఇంటరిమ్ పిటిషన్లపై వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. స్పందించిన బెంచ్.. ‘‘వీటిపై మంగళవారం (ఈ నెల 19) విచారణ చేపడతాం. 
మొత్తం 190కి పైగా కేసులు ఉన్నాయి. వాటిన్నింటిపై విచారణ చేపడతాం” అని తెలిపింది.