HCA కమిటీ రద్దు చేసిన సుప్రీంకోర్టు

HCA కమిటీ రద్దు చేసిన సుప్రీంకోర్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ కమిటీ స్థానంలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి లావు నాగేశ్వర రావుతో ఏకసభ్య కమిటీ నియమించింది. ఇకపై HCA వ్యవహారాలన్ని కొత్త కమిటీ చూసుకోనుంది. పెండింగ్ లో ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియతో పాటు ఇతర అంశాలను జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు పర్యవేక్షించనున్నారు. జస్టిస్ ఎస్.కె. కౌల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలన్న సుప్రీంకోర్టు.. తదుపరి ఆదేశాల వరకు హెచ్ సీఏకు సంబంధించి అన్ని  నిర్ణయాలు జస్టిస్ లావు నాగేశ్వర్ రావు చూసుకుంటారని చెప్పింది. ఏకసభ్య కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి ఆదేశాలు ఇస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. HCA వర్సెస్ చార్మినార్ క్రికెట్ క్లబ్ మధ్య కేసుకు సంబంధించి విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది.