
2021 పీజీ మెడికల్ సీట్ల వ్యవహరంలో సుప్రీం కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించింది. ప్రజల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని సుప్రీం తెలిపింది. దేశవ్యాప్తంగా 1456 మెడికల్ సీట్లు ఖాళీగా ఉండడంపై కోర్టు సీరియస్ అయింది. మెడికల్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా,కేంద్ర ప్రభుత్వం కలిసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమడుతున్నాయని సుప్రీం ఆగ్రహించింది. ఇన్ని సీట్లు ఖాళీగా ఎందుకు ఉండాల్సి వచ్చిందని నిలదీసింది. ప్రత్యేక కౌన్సిలింగ్ కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీం శుక్రవారం కొట్టివేసింది. ఈ పిటిషన్ ను నిన్న విచారించిన కోర్టు తీర్పు రిజర్వ్ చేసి ఈ రోజు వెల్లడించింది.
అయితే 2021లో మిగిలిన 1459 మెడికల్ సీట్ల అభ్యర్థుల ప్రత్యేక కౌన్సిలింగ్ ఇవ్వాలంటూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను జస్టిస్ ఎమ్ ఆర్ షా, జస్టిస్ అనిరుద్ తో కూడిన బెంచ్ విచారించింది. కేంద్ర ప్రభుత్వం తమ వాదనను శుక్రవారం వినిపించాలని నిన్న సుప్రీం తెలిసింది..ఈ మేరకు కొత్త సంవత్సరం మిగిలిన సీట్లను భర్తీ చేయడం వల్ల ప్రస్తుత కౌన్సిలింగ్ పై ప్రభావం పడుతుందని కేంద్రం వివరణ ఇచ్చింది. కేంద్రం వాదనను పరిగణలోకి తీసుకున్న సుప్రీం ఇవాళ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.