హ్యాకర్స్ మరింత బరితెగించేశారు.. ఏకంగా సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ చేశారు. ఛానెల్ హ్యాక్ చేసి.. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అనే పేరును తీసేసి.. ఆ స్థానంలో రిప్పల్ పేరు పెట్టారు. సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్ లో రెగ్యులర్ గా ఉండే కోర్టు లైవ్ ఫీడ్, కోర్టు తీర్పుల కంటెంట్ స్థానంలో.. క్రిప్టో కరెన్సీ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నారు. ఇది భారీ సైబర్ ఎటాక్ గా గుర్తించిన ప్రభుత్వం.. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కోర్టు లైవ్ ప్రొసీడింగ్‌లకు బదులుగా US కంపెనీ రిప్పల్ లాబ్స్ అభివృద్ధి చేసిన క్రిప్టోకరెన్సీ అయిన XRPని ప్రమోట్ చేసే వీడియోలను ఛానెల్ లో వస్తున్నాయి.
దీంతో ప్రభుత్వ వర్గాల్లో ఆన్ లైన్ లో ఉన్న గవర్నమెంట్ డిజిటల్ డేటాపై ఆందోళన నెలకొంది. సుప్రీం కోర్ట్ ఛానల్ అసలు కంటెంట్ తిరిగి తేవడానికి టెక్నిషియన్స్ ప్రయత్నిస్తున్నారు. ఛానల్ ను ఎవరు హ్యాక్ చేశారని కనిపెట్టే పనిలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హ్యాక్ అయిన కంటెంట్ రికవరీ చేస్తున్నారు.
[BREAKING] Supreme Court YouTube channel hackedhttps://t.co/T5hflRKbIZ
— Bar and Bench (@barandbench) September 20, 2024
ALSO READ : న్యూడ్ కాల్స్ తో ఎన్నారైలకు వల వేస్తున్న కేటుగాడు... అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు