
హైదరాబాద్: వినాయకుడి నిమజ్జనాలు హుస్సేన్ సాగర్‌లో చేయొచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలు చేయాలా వద్దా అనేదానిపై గురువారం సుప్రీంకోర్జులో విచారణ జరిగింది. అయితే నిమజ్జనాలకు ఈ ఏడాది మాత్రమే అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయకూడదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.