నేను రెండో పెళ్లి చేసుకోవట్లే..

నేను రెండో పెళ్లి చేసుకోవట్లే..

యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి దుబాయ్ శీను, భద్ర, బొమ్మరిల్లు వంటి పలు హిట్ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి.  గత కొన్ని రోజులుగా సురేఖ వాణి రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే సురేఖ రెండో పెళ్లి చేసుకుబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె కూతురు సుప్రిీత కోరిక మేరకే సురేఖ రెండో పెళ్లి చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే లేటెస్ట్ గా తన రెండో పెళ్లిపై సురేఖ వాణి స్పందించారు. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదన్నారు. ప్రస్తుతం తన కూతురితో సంతోషంగా ఉన్నానని చెప్పారు. సురేఖ వాణి భర్త సూర్యతేజ అనారోగ్యంతో 2019లో మరణించారు.

మమతా సర్కార్ పథకాలు ఆ పార్టీ నేతలకే…

ఓడిపోయే స్థానంలో మా చిన్నమ్మకు టికెట్ : పీవీ మనవడు

ఒకే అడ్రస్ పై 32.. బోధన్ లో నకిలీ పాస్ పోర్టుల కలకలం