
టాలీవుడ్‌లో నిర్మాత కేపీ చౌదరి(KP Choudary) డ్రగ్స్ కేసు పెను దుమారం రేపుతోంది. కేసులో భాగంగా జరిగిన విచారణలో షాకింగ్ విషయాలు బయటికొస్తున్నాయి. కోర్టు అనుమతితో పోలీసులు నిందితుడు కేపీ చౌదరిని రెండు రోజులు కస్టడీకి తీసుకుని సుదీర్ఘంగా ప్రశ్నించారు. విచారణలో భాగంగా కేపీ చౌదరి ఫోన్ కాల్స్ ను కూడా చెక్ చేశారు పోలీసులు. అతని ఫోన్‌లో పలువురి సెలబ్రిటీల ఫోటోలు కూడా ఉన్నాయి.
అందులో సినీ నటి సురేఖావాణితో పాటు ఆమె కూతురు సుప్రీత కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు కేపీ చౌదరితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కేపీ చౌదరితో వీరికున్న రిలేషన్ ఏంటి అనేది మాత్రం మిస్టరీగానే ఉంది.
ఇక ఈ ఫొటోస్ చూసిన చాలా మంది నెటిజన్స్.. కేపీ చౌదరి తప్పు చేసినంత మాత్రాన అతనితో ఫోటోలు దిగినవారు కూడా తప్పు చేసి ఉంటారని ఎలా అనుకుంటాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే.. సురేఖావాణి స్పందించాల్సిందే.