క్రికెట్కు టీమిండియా స్టార్ క్రికెటర్ వీడ్కోలు

 క్రికెట్కు టీమిండియా స్టార్ క్రికెటర్ వీడ్కోలు

క్రికెట్కు సురేష్ రైనా వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఐపీఎల్తో పాటు దేశవాలీ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. యూపీ నుంచి మంచి టాలెంటెడ్‌ యువ క్రికెటర్లు ఉన్నారని.. వారికి అవకాశం ఇవ్వడం కోసమే దేశవాళీ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు రైనా పేర్కొన్నాడు. ఈ విషయాన్ని యూపీ క్రికెట్‌ బోర్డుతో పాటు బీసీసీఐకి వెల్లడించినట్లు రైనా ప్రకటించాడు. దేశానికి, ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నానని రైనా చెప్పాడు. తనకు అండగా నిలిచిన బీసీసీఐ, యూపీ క్రికెట్ అసోసియేషన్‌, చెన్నై టీం, రాజీవ్‌ శుక్లా, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా  అని రైనా ట్విట్టర్ లో పేర్కొన్నాడు. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ కు రైనా గుడ్ బై చెప్పాడు. 

రోడ్ సేఫ్టీ సిరీస్లో ఆడతాను..
తాను మరో రెండు మూడేళ్లు మాత్రమే క్రికెట్ ఆడగలనని రైనా చెప్పాడు. అయితే దేశవాలీ క్రికెట్లో యూపీ నుంచి టాలెంటెడ్ ప్లేయర్లు వస్తున్నారని..వారికి అవకాశం ఇచ్చేందుకే ముందుగానే రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలిపాడు. తాను రోడ్ సేఫ్టీ సిరీస్లో ఆడేందుకు ఇప్పటికే యూపీ క్రికెట్ అసోసియేషన్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నానని వివరించాడు. ఈ నిర్ణయాన్ని బీసీసీఐ సెక్రటరీ జే షా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాలకు తెలియజేసినట్లు రైనా చెప్పుకొచ్చాడు.  దక్షిణాఫ్రికా, శ్రీలంక,UAE  T20 లీగ్స్ లో ఆడేందుకు  ఫ్రాంచైజీలు తనను సంప్రదించినట్లు రైనా వివరించాడు. వాటిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నాడు. ప్రస్తుతం ఘజియాబాద్‌లోని RPL క్రికెట్ మైదానంలో శిక్షణ పొందుతున్న రైనా చెప్పాడు.

 

క్రికెట్ కెరీర్..
2005లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లోకి అరంగేట్రం చేసిన రైనా..ఇప్పటి వరకు 226 మ్యాచులు ఆడాడు. మొత్తం 5615 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 36 అర్థ సెంచరీలున్నాయి. ఇక 2010లో శ్రీలంకపై తొలి టెస్టు ఆడిన రైనా...మొత్తంగా 18 టెస్టుల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. ఒక సెంచరీ, 7 హాఫ్ సెంచరీలతో సహా మొత్తం 768 రన్స్ సాధించాడు. అటు 2006లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ద్వారా టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు 78 మ్యాచుల్లో 1604 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 5 అర్థ సెంచరీలున్నాయి. అటు ఐపీఎల్ లో 205 మ్యాచులు ఆడిన రైనా..5528 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 39 హాఫ్ సెంచరీలున్నాయి. అన్ని ఫార్మాట్లలో కలిపి 87 వికెట్లు పడగొట్టాడు. 

విదేశీ లీగ్లలో ఆడేందుకు రిటైర్మెంట్..
అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న రైనా...త్వరలో యూఏఈ, సౌతాఫ్రికాలో జరిగే టీ20 లీగ్లలో ఆడనున్నట్లు సమాచారం. విదేశీ లీగ్స్లో ఆడాలనుకునే ప్లేయర్లు.. ఐపీఎల్‌ సహా భారత్లోని  దేశవాళీ క్రికెట్ కూడా ఆడొద్దు. అందుకే రైనా ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. అటు ఐపీఎల్‌ 2022 వేలంలో సురేష్‌ రైనాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.

రైనా రికార్డులు..
సురేష్ రైనా 2011ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడు. అంతేకాదు చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న జట్టులో సభ్యుడు. టీ20 కెరీర్‌లో 6000, 8000పరుగులు చేసిన మొదటి ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు.  ఐపీఎల్లో 5వేల పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్. అంతేకాకుండా ఛాంపియన్స్ లీగ్ టీ20 చరిత్రలో అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన ఆటగాడిగా కూడా రైనా  రికార్డు నెలకొల్పాడు.