సర్జికల్ స్ట్రైక్-2 : ఫిలింస్టార్స్ ప్రశంసలు

సర్జికల్ స్ట్రైక్-2 : ఫిలింస్టార్స్ ప్రశంసలు

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ లోని ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది భారత వైమానిక దళం. ఈ దాడిలో 300కి పైగా తీవ్రవాదులు హతమయ్యారు. దాడి సందర్బంగా దేశవ్యాప్తంగా ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. దాడి చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్స్ ట్వీట్స్ చేస్తున్నారు.  సర్జికల్ స్ట్రైక్ 2  అంటూ సోషల్‌ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

భారత సైన్యాన్ని ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. రాజమౌళి, ఎన్టీఆర్‌, మహేష్‌ బాబు, కమల్‌ హాసన్‌, రామ్ చరణ్, అఖిల్, వరుణ్ తేజ్‌,  మంచు విష్ణు, మెహరీన్‌, సోనాక్షి సిన్హా, నితిన్‌, ఉపాసన, వెంకీ అట్లూరిలతో పాటు పలువురు బాలీవుడ్‌, టాలీవుడ్ సెలబ్రిటీలు విజయానందాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు.