
డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ఆకట్టుకునే సూర్య (Suriya).. ప్రస్తుతం కంగువ (Kanguva) అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. శివ(Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి. సోమవారం ఆగస్ట్ 13న రిలీజ్ చేసిన ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్ లో సూర్య, బాబీ డియోల్ మధ్య జరిగిన యుద్ధం సీన్స్ ఆడియన్స్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అయితే, ఈ మూవీలో సూర్య Vs బాబీ డియోల్ అన్నట్టుగా వార్ సీన్స్ ఉండబోతున్నాయట. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ లోనే తెలిసిపోయింది. కానీ, ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే..సూర్య మరియు బాబీ డియోల్ మధ్య తెరకెక్కించే భీభత్సమైన వార్ సీన్ ను ఏకంగా 10 వేల మందితో తెరెకెక్కించినట్లు సమాచారం.
అంతేకాకుండా..కళ్లు చెదిరే సినిమాటిక్ ఎక్స్పీరియర్ష్ ను పలు భాషల ఆడియెన్స్ కు అందించాలన్న ఉద్దేశంతో ఈ యుద్ధ సన్నివేశంలోని ప్రతి యాక్షన్, స్టంట్స్, విజువలైజేషన్ ను ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ పర్యవేక్షణలో చేసినట్లు మరో కథనం వినిపిస్తోంది. ఇక ఈ వార్ సీన్ ఇండియా లెవల్లో ఇప్పటివరకు తెరకెక్కిన అద్భుతమైన వార్ సీన్స్ ని బీట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ న్యూస్ తెలుసుకున్న సూర్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కంగువ టీజర్ ను ట్రెండ్ చేస్తున్నారు.
ట్రైలర్ విషయానికి వస్తే..
ఒక్కమాటలో టీజర్ గురించి చెప్పాలంటే..సూర్య నట విశ్వరూపం చూపించాడు. అగ్నితో సెగలు రేపే అటవిక యోధుడిగా సూర్య వైల్డ్ లుక్ ఆకట్టుకుంటోంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఓ రహస్య దీవిలో రెండు గిరిజన తెగల మధ్య జరిగిన పోరాటం ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతున్నది. యుద్ధపిపాసిగా ప్రతినాయకుడు బాబీ డియోల్ కనిపించగా, తనవారిని రక్షించుకోవడానికి తానే ఒక సైన్యంగా మారే యుద్ధవీరుడు కంగువ పాత్రలో సూర్య కనిపించారు.భారీ ఓడలపై జరిగే యుద్ధ ఘట్టాలు, విజువల్స్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉన్నాయి. బాబీ డియోల్, సూర్య పాత్రలు సమవుజ్జీల సమరాన్ని తలపించాయి. మొత్తానికి ట్రైలర్ తో కట్టిపడేసిన కంగువ..ఇక థియేటర్లో రిలీజయ్యాక ఎలాంటి ప్రకంపనలు సృష్టించనుందో చూడాలి.