
టాలీవుడ్,కోలీవుడ్ లో పదికి పైగా హీరో హీరోయిన్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వారున్నారు. అందులో ఒక చక్కని జంట ఎవరంటే..టక్కున గుర్తొచ్చేది..సూర్య(Suriya)..జ్యోతిక(Jyothika) అనే చెప్పుకోవాలి. వీరిద్దరూ నటనలోనూ, ఆహ్యార్యంలోను, సామాజిక సేవ దృక్పథంలోనూ ఆదర్శంగా నిలిచారు.
1999లో విడుదలైన ‘పూవెల్లామ్ కేట్టుప్పార్’లో తొలిసారి ఈ జంట కలిసి నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ వరుసగా ఏడు సినిమాల్లో కలిసి నటించేలా సినీ జర్నీ సాగింది. ఇక సూర్య, జ్యోతికల పరిచయం ప్రేమగా మారడంతో.. 2006లో పెళ్లి చేసుకున్నారు.ఈ జంటకు ఇద్దరు పిల్లలు.
ఇదిలా ఉంటే..ప్రస్తుతం వీరిద్దరూ జోడిగా కనిపిస్తున్నట్లు సమాచారం. బ్లాక్ బాస్టర్ బెంగుళూరు డేస్ ఫేమ్ అంజలి మేనన్ డైరెక్షన్ లో సూర్య, జ్యోతికలు కలిసి ఓ మూవీ చేయనున్నారట. ప్రస్తుతం ఈ జోడీని స్క్రీన్ పై చూపించడానికి మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ అందమైన జంట కాంబోపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక ఇదే కనుక నిజమైతే దాదాపు 18 ఏళ్ల తరువాత సూర్య, జ్యోతిక మరోసారి వెండితెరపై.. కలిసి ప్రేమ పాఠాన్ని అభిమానులకి చెప్పే సమయం అతి దగ్గర్లోనే ఉంది.
ప్రస్తుతం వీరిద్దరి సినిమాల విషయానికి వస్తే..జ్యోతిక రీసెంట్ గా అజయ్ దేవగన్ తో నటించిన షైతాన్, మలయాళ స్టార్ మమ్ముట్టి తో కాదల్ ది కోర్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకున్నాయి. అలాగే కొన్ని సినిమాల్లో నటిస్తూనే..మంచి కంటెంట్ ఉన్న సినిమాలని నిర్మిస్తోంది. సూర్య ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే రీసెంట్ రైటర్, డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుతో సూర్య 44వ చిత్రాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.