జాతర పరిసరాలను పోలీసులు ఏఐ డ్రోన్లతో గస్తీ కాస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తూ ఎక్కడ రద్దీ పెరిగినా మొబైల్ పార్టీలను అలర్ట్ చేస్తున్నారు. వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ జాతర ట్రాఫిక్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. పస్రా జంక్షన్ నుంచి మేడారం వరకు ప్రతీ రెండు కిలోమీటర్లకు ఒక పోలీస్ చెక్ పోస్టు ద్వారా ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ఆరుగరు ఎస్పీలు, ఆరుగురు అడిషనల్ ఎస్పీలు, 26 మంది డీఏస్పీలు, 124 మంది సీఐలు, 200 మంది ఎస్సైలు, 4,138 మంది పోలీస్ సిబ్బంది డ్యూటీలో ఉన్నారు.
