ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్

ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్

ఈ నెల 23న రాయదుర్గం పీఎస్ లో నమోదైన యువకుడి మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. అదృశ్యమైన యువకుడిని క్రికెట్
బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేదని అతడి ఫ్రెండ్ చంపినట్టు పోలీసులు తేల్చారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇన్ స్పెక్టర్ రవీందర్ కథనం ప్రకారం..
మణికొండలోని శివపురి కాలనీకి చెంది న ఎర్రంశెట్టి ప్రసాద్ తల్లి, సోదరుడు కరణ్(26)తో కలిసి ఉంటున్నాడు. ప్రసాద్ కుటుంబం టిఫిన్ సెంటర్
నడిపేది. ఈ నెల 20న కరణ్ ఇంటి నుంచి బయటికెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు చుట్టుపక్కల ప్రాంతాల్లో కరణ్ కోసం వెతికారు. అతడి ఆచూకీ
దొరక్కపోవడంతో ఈ నెల 23న రాయదుర్గం పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బెట్టింగ్ డబ్బుల విషయంలో గొడవ కరణ్ కి మణికొండలో ఉంటున్న నగేశ్ చిన్నప్పటి ఫ్రెండ్. నగేశ్ స్థానికంగా ఎలక్ట్రిషీయన్ గా పనిచేస్తూ మణికొండలో మొబైల్ షాప్ నడుపుతున్నాడు.

కొద్ది రోజుల క్రితం కరణ్, నగేశ్ మధ్య ఐపీఎల్ బెట్టింగ్ విషయంలో వివాదాలు వచ్చాయి. అరుణ్ కుమార్.. నగేష్ కు రూ. 70వేలు బెట్టింగ్
డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఈ బెట్టింగ్ డబ్బుల విషయంలో ఇద్దరు గొడవపడ్డా రు. ఈ క్రమంలో ఈ నెల 20న కరణ్ కి ఫోన్ చేసిన నగేష్ సరదాగా
వికారాబాద్ జిల్లాలోని యాలాల్ మండలంలో ఉన్న తన ఊరికి వెళ్లివద్దామని చెప్పాడు. కరణ్ ని నగేశ్ తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు.
మార్గమధ్యలో మొయినా బాద్ గ్రామ శివారులో రాత్రి 8.30 గంటల సమయంలో ఇద్దరి మధ్య మరోసారి క్రికెట్ బెట్టింగ్ డబ్బుల విషయంలో
గొడవ జరిగింది. ఈ గొడవతో ఆగ్రహానికి గురైన నగేష్ తన కారులో రాడ్డుతో కరణ్ తలపై బలంగా కొట్టాడు. కరణ్ కి తీవ్రగాయాలతో కిందపడిపో-
యాడు. నగే శ్ భయపడి అరుణ్ ని హాస్పి టల్ కి తీసుకెళ్లేందుకు కారులో సిటీకి వస్తున్నాడు.
టీఎస్పీఏ జంక్షన్ దగ్గరికి రాగానే అరుణ్ చనిపోయాడు.

భయాందోళనకు గురైన నగేశ్ తన బావ శ్రీనివాస్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. శ్రీనివాస్..నగేశ్ దగ్గరికి వచ్చాడు. ఇద్దరూ కలిసి
కారులో కరణ్ డెడ్ బాడీని తీసుకుని మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ గ్రామ శివారు వద్ద ఉన్న టోల్ ప్లాజ్ దగ్గరికి వెళ్లారు. ఆ ప్లాజా సమీపంలో
శ్రీనివాస్ సాయంతో నగేశ్ గుంత తవ్వి కరణ్ డెడ్ బాడీని పూడ్చిపెట్టాడు. తిరిగి నగేశ్, శ్రీనివాస్ ఇద్దరూ సిటీకి వచ్చారు. నిందితులు ఇలా దొరికారు
కరణ్ అదృశ్యం పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన రాయదుర్గం పోలీసులు కరణ్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్ తు చేపట్టారు.
కరణ్ తన చివరి ఫోన్ కాల్ నగేష్ తో మాట్లాడడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. నగేశ్ చేసిన నేరాన్ని విచారణలో
అంగీకరించాడు. నగేష్ కు సాయపడ్డ అతడి బావ శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కరణ్ డెడ్ బాడీని పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని
పోలీసులు గుర్తించారు. డెడ్ బాడీని బయటికి తీసి పోస్టుమార్టం కోసం కొడంగల్ గవర్నమెంట్ హాస్పి టల్ కి తరలించారు. నింది తులు నగేశ్,
శ్రీనివాస్ ని అరెస్ట్ చేసినట్టు ఇన్ స్పెక్టర్ రవీందర్ తెలిపారు.