V6 News

కొత్త అనుభూతినిచ్చేలా సూర్య బి పాజిటివ్

కొత్త అనుభూతినిచ్చేలా సూర్య బి పాజిటివ్

చరణ్ పీసర్ల హీరోగా,  యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సుబ్బా మాధవరపు దర్శకత్వంలో రూపొందిన చిత్రం  ‘సూర్య బి పాజిటివ్’. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. అతిథులుగా హాజరైన  ‘దండోరా’  చిత్ర దర్శకుడు మురళికాంత్,  ‘కిష్కింధపురి’  చిత్ర దర్శకులు కౌశిక్ పెగల్లపాటి సినిమా సక్సెస్  సాధించాలని విష్ చేశారు.

 ఈ సందర్భంగా హీరో  చరణ్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలోని పాత్రలు ప్రేక్షకులకు కొత్త ఫీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఇస్తాయి. మా దర్శకుడు అన్ని ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రూపొందించిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది’ అని అన్నాడు. ఈ చిత్రంలో నటించినందుకు సంతోషంగా  ఉందని హీరోయిన్స్ యానీ డయానా, దివ్య విశ్వకర్మ  అన్నారు. నటులు బలగం సత్య,  రోహిత్ సత్యన్, లిరిసిస్ట్ రాంబాబు గోసాల పాల్గొన్నారు.