Suryakumar Yadav: ఐసీసీనే మెప్పించాడు.. టీ20 టీమ్‌ ఆఫ్‌ ది కెప్టెన్​గా సూర్య భాయ్​

Suryakumar Yadav: ఐసీసీనే మెప్పించాడు.. టీ20 టీమ్‌ ఆఫ్‌ ది కెప్టెన్​గా సూర్య భాయ్​

గతేడాది పొట్టి ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఆటగాళ్లతో కూడిన జట్టును ఐసీసీ అనౌన్స్ చేసింది. ఈ టీమ్‌‌కు సారథిగా భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసింది. ఈ జట్టులో సూర్యతో పాటు యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్ నలుగురు భారత క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు.   

యశస్వి జైస్వాల్‌కు జోడీగా ఇంగ్లాండ్​ ప్లేయర్​ ఫిల్ సాల్ట్‌ను ఎంపిక చేసిన ఐసీసీ..  మూడో స్థానంలో విండీస్ హిట్టర్ నికోలస్‌ పూరన్‌, నాలుగో స్థానంలో సూర్య సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో న్యూజిలాండ్ బ్యాటర్  మార్క్‌ చాప్‌మన్‌ను తీసుకుంది. ఇక ఆల్‌రౌండర్లుగా జింబాబ్వే ప్లేయర్​ సికందర్‌ రాజా, ఉగాండ ఆటగాడు అల్పేష్‌ రంజనీలకు.. స్పెషలిస్ట్‌ బౌలర్లుగా మార్క్‌ అడైర్‌ (ఐర్లాండ్‌), రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ (టీమ్​ ఇండియా), రిచర్డ్‌ నగరవ(జింబాబ్వే)లకు చోటు కల్పిచింది. 

ఈ జట్టులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, పాకిస్థాన్​, శ్రీలంక, ఆఫ్గానిస్తాన్​ జట్ల నుంచి ఒక్క ప్లేయర్​ కూడా ఎంపిక కాకపోవడం గమనార్హం.

ఐసీసీ టీ20 టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్ 2023: ఫిల్ సాల్ట్, యశస్వి జైస్వాల్, నికోలస్‌ పూరన్, సూర్యకుమార్ యాదవ్‌ (కెప్టెన్), మార్క్‌ చాప్‌మన్,  సికిందర్‌ రాజా, మార్క్‌ ఐడెర్, రవి బిష్ణోయ్‌, రామ్‌జాని, అర్ష్‌దీప్‌ సింగ్‌, రిచర్డ్‌ ఎన్‌గరవ.