టీ20 ర్యాంకింగ్స్లో దిగజారిన సూర్యకుమార్ యాదవ్

టీ20 ర్యాంకింగ్స్లో దిగజారిన  సూర్యకుమార్ యాదవ్

టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్..టీ20 ర్యాంకింగ్స్లో దిగజారాడు. మూడో స్థానంలో ఉన్న సూర్య..పాక్ తో జరిగిన మ్యాచ్ లో విఫలమవడంతో..నాల్గో స్థానానికి పడిపోయాడు. టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో సూపర్ హాఫ్ సెంచరీ చేసిన రిజ్వాన్..టీ20లో నెంబర్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. మొత్తం 815 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 

టాప్ స్కోరర్..టాప్ పొజిషన్..
ఆసియాకప్లో రిజ్వాన్ అద్భుతంగా ఆడుతున్నాడు. 29 ఏళ్ల రిజ్వాన్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో .. రిజ్వాన్ 96 సగటుతో 192 పరుగులు సాధించాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. హాంకాంగ్తో జరిగిన మ్యా్చ్లో 78 పరుగులు చేసి  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.  సూపర్ ఫోర్ మ్యాచ్‌లో రిజ్వాన్ భారత్‌పై 71పరుగులు చేశాడు. దీంతో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ను వెనక్కు నెట్టి..ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో  టాప్ పొజిషన్కు చేరుకున్నాడు.  బాబర్ అజామ్..794 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 

14వ స్థానంలో రోహిత్ శర్మ 
సౌతాఫ్రికాకు చెందిన ద ఐడెన్ మార్క్రామ్ నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకాడు. ఇక దసున్ షనక కూడా ఏడు స్థానాలు ఎగబాకాడు. ఈ ర్యాంకింగ్స్లో  టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. మూడు స్థానాలు ఎగబాకి 14వ స్థానానికి చేరుకున్నాడు. లంకతో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయిన కోహ్లీ రెండు స్థానాలు పడిపోయి 29వ స్థానంలో నిలిచాడు.  శ్రీలంక ప్లేయర్ కుశాల్ మెండిస్ ర్యాంకింగ్స్‌లో 18 స్థానాలు ఎగబాకి 42వ స్థానానికి చేరుకున్నాడు.