పిచ్ ఎలా ఉందన్నది కాదు...మన దగ్గర దమ్ముండాలి

పిచ్ ఎలా ఉందన్నది కాదు...మన దగ్గర దమ్ముండాలి

అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో మూడో టీ20 ఆడటం సంతోషంగా ఉందని టీమిండియా 360 డిగ్రీస్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. సరిగా రెండేళ్ల క్రితం ఇదే వేదికపై ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చానని చెప్పాడు. అహ్మదాబాద్ స్టేడియంలోని డ్రెస్సింగ్ రూంలోకి రాగానే..తాను ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికే వచ్చానని తన మేనేజ్ మెంట్తో చెప్పినట్లు సూర్య వెల్లడించాడు. నరేంద్రమోడీ స్టేడియంలో తనకు ఎన్నో గుడ్ మెమోరీస్ ఉన్నాయన్నాడు. నరేంద్ర మోడీ స్టేడియం అద్బుతమైన స్టేడియం అని..ఎక్కువ సంఖ్యలో వచ్చే ప్రేక్షకుల మధ్య ఆడటం గొప్పగా ఉంటుందన్నాడు. 

అహ్మదాబాద్ పిచ్పై సూర్య కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చివరి టీ20 జరిగే నరేంద్రమోడీ స్టేడియం వికెట్ ఎర్ర భూమా..? నల్ల భూమా అనేది ముఖ్యం కాదని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఎలాంటి పిచ్ పై ఆడుతున్నామనేది తమ చేతుల్లో ఉండదని చెప్పాడు. రెండో టీ20లో  తాము ఏం చేయగలమో అదే చేశామన్నారు. తక్కువ స్కోరు మ్యాచ్ అయినా.. ఎగ్జయింట్ గేమ్ అని చెప్పాడు.  టీ20 అయినా..50 ఓవర్ల మ్యాచ్ అయినా... జట్ల మధ్య పోటీ ఉన్నప్పుడు రసవత్తరంగా ఉంటుందన్నాడు. వికెట్ అనేది అంత పెద్ద విషయం కాదని చెప్పాడు. ఛాలెంజ్‌ను అంగీకరించి ముందుకుపోవడమే అని  సూర్య  తెలిపాడు.