టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ గాయం నుండి కోలుకున్నాడు. బుచ్చిబాబు టోర్నీకి ముందు బొటన వేలు గాయంతో ఆటకు దూరమైన స్కై తాజాగా రికవరీ అయ్యాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) నుండి ఫిట్నెస్ క్లియరెన్స్ రావడంతో దులీప్ ట్రోఫీ 2024లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. దులీప్ ట్రోఫీలో ఇండియా బీ టీమ్ తరుఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న స్కై.. లీగ్ మొదటి రెండు మ్యాచులకు దూరమయ్యాడు.
సెప్టెంబర్ 18వ తేదీ నుండి శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ఇండియా డీ టీమ్‌తో జరగనున్న చివరి రౌండ్ మ్యాచ్‌లో సూర్య గ్రౌండ్లో అడుగు పెట్టనున్నాడు. యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగుతాడని ఇండియా బీ టీమ్ తెలిపింది. సూర్య రీ ఎంట్రీతో ఇండియా బీ టీమ్ బ్యాటింగ్ లైనప్ మరింత స్ట్రాంగ్ కానుంది. సర్ఫరాజ్ ఖాన్ బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన విషయం తెలిసిందే.
దులీప్ ట్రోఫీ 2024 కోసం భారత B జట్టు:
అభిమన్యు ఈశ్వరన్ (సి), ఎన్ జగదీశన్ (WK), హిమాన్షు మంత్రి ( WK) సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్థి, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, ముఖేష్ కుమార్, ముషీర్ ఖాన్, రాహుల్ చాహర్, సుయాష్ ప్రభుదేసాయి