కోదాడలో NHపై రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన యోలా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

కోదాడలో NHపై రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన యోలా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయ రహదారి పై తెల్లవారుజామున  రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈ ఘటనలో  ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి  ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు  ఢీకొట్టింది.  కాకినాడ నుండి హైదరాబాద్ వస్తుండగా యోలా' ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ  సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులుండగా.. ఆరుగురికి  గాయాలయ్యాయి. 

సమాచారం అందుకున్న  కోదాడ టౌన్ సిఐ శివ శంకర్ నాయక్  ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైవేపై ప్రమాదం జరగడంతో దెబ్బతిన్న వాహనాలను పక్కకు తొలగించి.. ట్రాఫిక్​ ను క్లియర్​ చేశారు పోలీసులు.  బస్సు డ్రైవర్ నిద్రమత్తే  ప్రమాదానికి కారణమని బస్సు ప్రయాణికులు అనుమానిస్తున్నారు.