సూర్యాపేట క్రైం, వెలుగు:- జిల్లాలో 11 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ సూర్యాపేట ఎస్పీ నరసింహ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతగిరి ఎస్సై ఎన్ నవీన్ కుమార్ ను మేళ్లచెరువుకు, మేళ్లచెరువు ఎస్సై పి.పరమేశ్‌ను మల్లారెడ్డిగూడెం, అక్కడి ఎస్సై సందీప్ రెడ్డిని సూర్యాపేట వన్ టౌన్ కు, మునగాల ఎస్సై బి. ప్రవీణ్ కుమార్ ను మట్టంపల్లి, అక్కడి ఎస్సై పి. బాబు నల్గొండ వీఆర్ కు బదిలీ అయ్యారు.
మిర్యాలగూడ వన్ టౌన్ ఎస్సైఎ. సైదిరెడ్డి నేరేడుచర్ల కు అక్కడి ఎస్సై ఎ. రవీందర్ నాయక్ ను సూర్యాపేట వీఆర్ కు బదిలీ చేశారు. ఆత్మకూర్(ఎస్) ఎస్సై బి. శ్రీకాంత్ గౌడ్ ను గరిడేపల్లికి, అక్కడి ఎస్సై సీహెచ్.నరేశ్ హుజూర్‌నగర్ కు బదిలీ అయ్యారు. హుజూర్‌నగర్ ఎస్సై బి.మోహన్ బాబును సూర్యాపేట వీఆర్ కు, కోదాడ టౌన్ ఎస్సై బి. హనుమాన్ ను హుజూర్‌నగర్ ఎస్సై–2గా పోస్టింగ్ ఇచ్చారు.
