సుశాంత్‌ ఆత్మహత్య కేసు: కంగనా రనౌత్‌కు నోటీసులు

సుశాంత్‌ ఆత్మహత్య కేసు: కంగనా రనౌత్‌కు నోటీసులు

వాంగ్మూలం ఇవ్వాలని కోరిన ముంబై పోలీసులు

ముంబై: సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి బాలీవుడ్‌లోని నెపోటిజమ్‌ గురించి ఆరోపించిన నటి కంగనా రనౌత్‌కు ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. బాంద్రా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేయాలని ఆమెను కోరారు. నోటీసులు ఇచ్చిన విషయాన్ని కంగనా తరఫు లాయర్‌‌ కూడా ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆమె మనీలాలో ఉందని, ఒక టీమ్‌ను అక్కడికి పంపి స్టేట్‌మెంట్‌ను పర్సనల్‌గా రికార్డ్‌ చేయాలని పోలీసులను కోరామని ఆయన అన్నారు. కాగా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు ఇప్పటికే కొంత మంది బాలీవుడ్‌ నటులను విచారించారు. చిచోరే, బద్రీనాథ్‌, ధోనీ తదితర సినిమాల్లో నటించిన సుశాంత్‌ సింగ్‌ తన ఫ్లాట్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆయన మృతి గురించి కంగనా రనౌత్‌ ఎన్నో విమర్శలు చేశారు. బాలీవుడ్‌లో నెపోజిటమ్‌ ఉందని, కొన్ని వర్గాల వారు మాత్రమే బాలీవుడ్‌లో ఎదగగలరని సెన్షేనల్‌ కామెంట్స్‌ చేశారు. ఆమె చేసిన కామెంట్స్‌ను నిరూపించలేకపోతే తనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును కూడా వెనక్కి ఇచ్చేస్తానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.