 
                                    15ఏళ్ల బాలిక..అనుమానాస్పద మృతి..ఉరివేసుకొని చనిపోయిందంటున్న పేరెంట్స్.. కాదు బాలికను హత్య చేసి ఉంటారని అమ్మమ్మ ఫిర్యాదు.. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కొండాపూర్ లో బాలిక ఆత్మహత్యపై పలు అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
జగిత్యాల జిల్లాలో ని కొండాపూర్ కి చెందిన బాలిక సహస్ర శుక్రవారం(అక్టోబర్31) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే బాలిక మృతి సహజం లేదని పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు, బంధువులు. బాలిక అమ్మమ్మ తన మనవరాలి మృతిపట్ల అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఏం జరిగిందంటే..
కొండాపూర్ కు చెందిన రవి, జ్యోతిలకు 16ఏళ్ల క్రితం పెళ్లైంది. వారికి కొడుకు, కూతురు సహస్ర(మృతురాలు) ఉన్నారు. 2017లో జ్యోతి ఉరివేసుకొని చనిపోవడంతో రవి రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి మృతురాలిని సవతి తల్లి మానసిక వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
తల్లి చనిపోయినప్పటి నుంచి సహస్రను తన అమ్మమ్మ, ఇతర బంధువులను కలవకుండా వేధించారని బంధువులు చెబుతున్నారు. తండ్రి రవి, సవతి తల్లి కిలసి సహస్రను హత్య చేసి ఉరివేసుకొని చనిపోయిందని డ్రామా అడుతున్నారని మృతురాలి అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సహస్ర ను మృతి విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

 
         
                     
                     
                    