
నిర్మల్ జిల్లా: తానూర్ మండలం సింగన్ గావ్ లో విషాదం చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం అదృశ్యమైన ముగ్గురు బాలికలు చనిపోయారు. వీరి డెడ్ బాడీలు సింగన్ గావ్ చెరువులో దొరికాయి. మృతులు సునీత, వైశాలి, అంజలిగా గుర్తించారు. సునీత, వైశాలి అక్కాచెల్లెలు. అంజలి వీరి సమీప బంధువు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు ముగ్గురు చనిపోయారా ? ఆత్యహత్య చేసుకున్నారా ? లేక వీరిని హత్య చేసి చెరువులో పడేశారా అన్న కోణం లో విచారణ చేస్తున్నారు.