
విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. నేహా శెట్టి హీరోయిన్. అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. గోదావరి డెల్టా నేపథ్యంలో రూపొందుతున్న ఈ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా నుంచి బుధవారం ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘సుట్టంలా సూసి పోకలా.. సుట్టేసుకోవే సీరలా ’ అనే పల్లవితో సాగే ఈ పాటను యువన్ శంకర్ రాజా కంపోజ్ చేయగా, అనురాగ్ కులకర్ణి పాడాడు. ‘అద్దాల ఓణీలా, ఆకాశవాణిలా.. గోదారి గట్టుపై మెరిశావు మణిలా.. పెద్దింటి దానిలా, బంగారు గనిలా.. సూత్తానే నిన్నిలా నా రెండు కన్నులా..’ అంటూ శ్రీ హర్ష ఈమని రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. సితార, ఫార్చ్యూన్ ఫోర్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 8న విడుదల కానుంది.