అలా చేయకుంటే మిమ్మల్ని 10ఏళ్ళు బ్యాడ్ లక్ వెంటాడుతుందంటూ శ్రీ విష్ణు ప్రమోషన్.

అలా చేయకుంటే మిమ్మల్ని 10ఏళ్ళు బ్యాడ్ లక్ వెంటాడుతుందంటూ శ్రీ విష్ణు ప్రమోషన్.

తెలుగులో రాజరాజ చోర మూవీ ఫేమ్ హసిత్ గోలి ప్రస్తుతం 'స్వాగ్' అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో టాలీవుడ్ ప్రముఖ హీరో శ్రీ విష్ణు హీరోగా నటించగా రితూ వర్మ, దక్ష నాగర్కర్, మీరా జాస్మిన్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. అయితే ఈచిత్రం అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేశారు. 

శ్రీవిష్ణు కొంతమేర డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర టికెట్ల బుకింగ్స్ ఓపెన్ చేశామని సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో ద్వారా తన అభిమానులకి తెలియజేశాడు. ఇందులో భాగంగా బుక్ మై షో యాప్ లో స్వాగ్ మూవీ టికెట్ల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని దీంతో వెంటనే టికెట్లు బుక్ చేసుకోవాలని తెలిపాడు. అలాగే మీతోపాటు మరో 10 మందికి ఈ టికెట్లు బుకింగ్ విషయం షేర్ చెయ్యాలని లేకపోతే 10 ఏళ్ళ పాటు మిమ్మల్ని బ్యాడ్ లక్ వెంటాడుతుందని సరదాగా చెప్పాడు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.

Also Read :- అవన్నీ ఫేక్.. నా భర్త మంచోడు

ఈ మధ్య శ్రీవిష్ణు ఎక్కువగా కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ జోనర్ చిత్రాలను ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలో శ్రీ విష్ణు గతంలో నటించిన ఓం భీం బుష్ మరియు సామజవరగమన చిత్రాలు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక స్వాగ్ చిత్ర ట్రైలర్ కూడా బాగానే ఆకట్టుకుంది. దీంతో స్వాగ్ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని శ్రీవిష్ణు భావిస్తున్నాడు.