హైదరాబాద్, వెలుగు: ఆరెస్సెస్ అనుబంధ సంస్థ అయిన స్వదేశీ జాగరణ్ మంచ్ మహిళా సంఘ్ రాష్ట్ర ప్రముఖ్‌గా మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌కు చెందిన స్వప్న బల్ల నియమితులయ్యారు. ఈ నెల 4, 5 తేదీల్లో నాగ్‌పూర్‌లో జరిగిన స్వదేశీ జాగరణ్ మంచ్ జాతీయ మహాసభల్లో మంచ్ విభాగం జాతీయ కన్వీనర్ సుందరన్ ఆమెను నియమించారు. 2010 నుంచి జాతీయవాద సంస్థల పట్ల ఆకర్షితురాలై అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన స్వప్న.. పలు సంఘ్ పరివార సంస్థల్లో పని చేస్తున్నారు. ప్రస్తుతం ఫిలిం సెన్సార్ బోర్డు సలహా మండలి సభ్యురాలిగా ఉన్నారు. స్వదేశీ మేళాలను నిర్వహించి మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె చెప్పారు.
