- సీఎంను కలిసిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్
హైదరాబాద్, వెలుగు : మహబూబ్‌నగర్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో స్వర్ణ సుధాకర్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా.. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కూడా బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
