
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమంలో ఘనంగా జరిగింది. బోనాలు పండుగ తరువాతి రోజు ( జులై 14) జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలుచుని స్వర్ణలత భవిష్యవాణి పలికారు. అమ్మవారి ప్రతిరూపంలో మాతంగి స్వర్ణలత ఏ ఏ అంశాలు వ్యక్తపరుస్తుందనే ఆసక్తితో ఎదురు చూస్తున్న భక్తజనానికి అమ్మవారికి పలుకులు ఆనందాన్ని ఇచ్చాయి.
ఈ ఏడాది భక్తులు సమర్పించిన బోనాలను సంతోషంగా అందుకున్నానన్నారు. కాని ప్రతి ఏడాది మాదిరిగా ఏదో ఒక ఆటంకం కలుగజేస్తున్నారని భవిష్యవాణిలో అమ్మ అన్నారు. ఏటా నా కోరిక చెపుతున్నా లెక్కచేయడం లేదనని అమ్మవారి రూపంలో ఉన్న మాతంగి స్వర్ణలత అన్నారు. .
తల్లి దండ్రులు పిల్లలను విచ్చల విడిగా వదిలేస్తున్నారన్నారు. అయినా నా బిడ్డలను నేను కాపాడుకుంటున్నాని అన్నారు. నేను కోపం చూపించడం లేదు.. పూజలు జరిపించాలని భక్తులను ఆదేశించారు.
ఎవరి ఏది అనుభవించాలో వారు... తప్పక అనుభవిస్తారని స్వర్ణలత చెప్పారు. అమ్మవారికి విధివిధంగా పూజలు జరిపించాలని ఆదేశిచారు. నా భక్తులను వెంట ఉండి కాపాడుతానని స్వర్ణలత అన్నారు. తెలంగాణతో పాటు భారతదేశాన్ని కాపాడే బాధ్యత నాదేన్ననని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
ఈ ఏడాది వర్షాలు బాగానే పడతాయని... పాడి పంటలు బాగానే ఉంటాయని మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కాని అగ్నిప్రమాదాలు జరుగుతాయని....... రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుంది ప్రజలు జాగ్రత్త ఉండాలని అమ్మవారి రూపంలో ఉన్న మాతంగి స్వర్ణలత రంగం కార్యక్రమంలో భవిష్యవాణిలో చెప్పారు.
నాకు పూజలు సరిగ్గా జరిపించడం లేదు..అందుకే మరణాలు పెరుగుతున్నాయి..నేను అస్సలు ఆ విషయంలో అడ్డుపడను..నాకు రక్తం బలి కావాలి...నన్ను కొలిచే వారి కి నేను ఎప్పుడు తోడు గా నిలబడుతానన్నారు. తనకు రక్తం చూపించాలని..చూపించకపోతే ఊరుకోనని అన్నారు. ప్రాణానికి నష్టం జరిపించను కాని.. రక్తం చూపిస్తానని అన్నారు. నాకు రావలసిన రూపాయికి కూడా మీరు అడ్డుపడుతున్నారన్నారు. నన్ను కొలిచేవారికి ఎలాంటి ఇబ్బంది కలుగజేయనని తెలిపారు. అందరినీ సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటానని తెలిపారు.ఈ ఏడాది ఐదువారాల పాటు పప్పు బెల్లాలతో సాక పెట్టాలని భక్తులను అమ్మవారు ఆజ్జాపించారు.