
తెలంగాణ హైకోర్టులో కొత్తగా నలుగురు అడిషనల్ జడ్జిలు జులై 31న ప్రమాణ స్వీకారం చేశారు. గాడి ప్రవీణ్ కుమార్, చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గౌస్ మీరా మొహుద్దీన్ ప్రమాణం చేశారు. సీజే ఆపరేష్ కుమార్ సింగ్ వీళ్లతో ప్రమాణం చేయించారు. పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హైకోర్టులో లాయర్లుగా ఉన్న ఈ నలగురిని కొత్త జడ్జీల నియామకానికి కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ మేరకు గతంలో సుప్రీం కోలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 28న ఆమోద ముద్ర వేశారు. దీంతో తెలంగాణ హైకోర్టు జడ్జిల సంఖ్య 30కి చేరింది.