
ఫిల్మ్ ఇండస్ట్రీలో గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవడం సర్వసాధారణం. సాయితేజ్ అయితే ఆ పద్ధతిని రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాడు. తరచూ ఎవరో ఒకరికి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తుంటాడని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు నభా నటేష్ ని కూడా తన గిఫ్ట్‌తో సర్ ప్రైజ్ చేశాడు తేజ్. ‘సోలో బ్రతుకే సో బెటర్ ’లో తేజ్ సరసన నభా హీరోయిన్‌గా నటిస్తోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ కరోనా బ్రేక్ తర్వాత రీసెంట్ గా సెట్స్ కి వెళ్లింది. ఆదివారం నభాకి సంబంధించిన సీన్స్ తీయడం పూర్తయింది. దాంతో ఆమెకి ఓ సర్ ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు తేజ్. కోవిడ్ టైమ్ లో ధైర్యంగా షూట్ కి వచ్చి సహకరించినందుకు థ్యాంక్స్ చెబుతూ ఓ గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడు. అందులో వైట్ డ్రెస్, నభా ఫొటో ఫ్రేమ్, కొన్ని కాస్మొటిక్స్, శానిటైజర్, చాక్లెట్లు ఉన్నాయి. వాటన్నింటినీ చూసి ఫిదా అయిపోయిన నభా.. థాంక్యూ తేజూ అంటూ ఓ హ్యాపీ వీడియోను పోస్ట్ చేసింది. ఈ మూవీలో విరాట్ పాత్రలో తేజ్, అమృత పాత్రలో నభా నటిస్తున్నారు. తమ పాత్రలు ఎంతో ఇంటరెస్టింగ్ గా ఉంటాయని, తన రోల్ అయితే స్ట్రాంగ్ గానే కాక కాస్త ఫన్నీగా కూడా ఉంటుందని అంటోంది నభా. ఈ సినిమా ఓటీటీలో కానుందనే ప్రచారం జరుగుతోంది.