పుంజుకుంటున్న స్వెట్టర్ల వ్యాపారం

పుంజుకుంటున్న స్వెట్టర్ల వ్యాపారం

హైదరాబాద్– చలికాలం  మొదలైతే చాలు... ఇంట్లో నుంచి బయటకు రావడం కష్టంగా ఉంటోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి బాగా ఉండటంతో చిన్నారులు వృద్ధులు అవస్థలు పడుతున్నారు. చలి నుంచి కాపాడుకోడారిని ఉన్ని దుస్తులను వాడుతున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత పెరగడంతో హైదరాబాద్ మార్కెట్లలో స్వెట్టర్లు వ్యాపారం పుంజుకుంటోంది. హైదరాబాద్ లో గత వారం రోజుల నుంచి చలి జనానికి వణుకు పుట్టిస్తోంది. చలి నుంచి రక్షించుకోడానికి జనం ఉన్నితో తయారు చేసిన బ్లాంకెట్స్ కొంటున్నారు. రకరకాల డిజైన్ల స్వెట్టర్లు, మంకీ టోపీలు,  చేతులకు వాడే గ్లౌజులకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. అమీర్ పేట్, CBS దగ్గర,  కోఠి, ఉప్పల్, సికింద్రాబాద్,ఎల్బీనగర్, జీడిమెట్ల, కూకట్ పల్లి, మియాపూర్, లింగంపల్లి, అత్తాపూర్ ఏరియాల్లో స్వెట్టర్లు బిజినెస్ జోరుగా నడుస్తోంది. 

కరోనా వైరస్ కారణంగా రెండేళ్లుగా బిజినెస్ లేక దివాలా తీశామంటున్నారు స్వెట్టర్లు వ్యాపారులు. చలికాలం కావడంతో ఇప్పుడిప్పుడే బిజినెస్ పెరిగిందని చెబుతున్నారు. నేపాల్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర సహా వివిధ  రాష్ట్రాల నుంచి బ్లాంకెట్స్ తీసుకువచ్చి సేల్స్ చేస్తున్నామంటున్నారు.  లాక్ డౌన్ ఎఫెక్టుతో స్వెట్టర్స్ ధరలు కూడా కాస్త పెరిగాయంటున్నారు వ్యాపారులు. మహిళలు, చిన్నారుల మాస్కులు, స్వెట్టర్లు ఎక్కువగా సేల్ అవుతున్నట్టు చెప్పారు. 150 రూపాయల నుంచి  1250 వరకు రేట్లు ఉన్నాయన్నారు  వ్యాపారులు. 
 
లాక్ డౌన్  కు ముందు స్వెట్టర్ల కాస్ట్ తక్కువగా ఉండేదనీ... ప్రజెంట్ పెరిగాయయంటున్నారు కస్టమర్లు. అయితే బడా షాపింగ్ మాల్స్ లో వెయ్యి, 12 వందల రూపాయలు ఉండే స్వెట్టర్లు రోడ్ సైడ్ వ్యాపారులు దగ్గర ఐదారొందలకే దొరుకుతున్నట్టు చెప్పారు. మధ్యతరగతి, పేద ప్రజలకు ఇక్కడ కొనుక్కోవడమే బెటర్ అంటున్నారు జనం.  చలి తీవ్రత పెరగడంతో రక రకాల డిజైన్లతో తయారు చేసిన స్వెట్టర్లు, మంకీ క్యాప్స్, చిన్నపిల్లల బట్టలు బాగా అమ్ముడుపోతున్నాయి.