సింగరేణి భూముల్లో ఉన్న ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇప్పిస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో పర్యటించిన ఆయన 3,18 వ వార్డుల్లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం పలు వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోడ్లు, డ్రైనేజీ కాలువలు,విద్యుత్ ఫోల్స్,ఇందిరమ్మ ఇండ్లు కల్పించాలని మంత్రిని కోరారు కాలనీల వాసులు. ఆర్కే ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ తో ఇండ్లు దెబ్బతింటున్నయాని, దుమ్ము ధూళి తో అనారోగ్యం పాలవుతున్నామనీ మంత్రికి చెప్పారు కాలనీ వాసులు. ఓపెన్ కాస్ట్ ప్రభావిత ప్రాంతంగా గుర్తించి పునరావాసం,సౌకర్యాలు కల్పించాలని కోరారు.
►ALSO READ | నాలుగోరోజు కూడా సంక్రాంతి రష్.. కొర్లపహాడ్ టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామ్
ఓసీ ప్రభావిత ప్రాంతంగా గుర్తించి చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు మంత్రి. నిలిపివేసిన 76 జీవో అమలు చేసి ఇండ్ల క్రమబద్ధీకరణ చేయాలని స్థానికులు కోరగా.. రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి ఇండ్ల పట్టాలు ఇప్పిస్తానని చెప్పారు. కాలనీల్లో బెల్ట్ షాపులతో ఇబ్బందులు పడుతున్నామని మహిళలు తెలిపారు. వెంటనే బెల్టు షాపులను అరికట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి.
