ఉద్యోగుల కోసం స్విగ్గీ అంబులెన్స్ సర్వీస్

ఉద్యోగుల కోసం స్విగ్గీ అంబులెన్స్ సర్వీస్

ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ ఎంప్లాయిస్ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది కోసం అంబులెన్స్ సేవలు ప్రారంభించింది. అత్యవసర సమయాల్లో సిబ్బంది దీన్ని ఉపయోగించుకోవచ్చని చెప్పింది. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ తో పాటు ఎస్వోఎస్ను అందుబాటులోకి తెచ్చింది.

పైలెట్ ప్రాజెక్టుగా తొలుత బెంగళూరులో అంబులెన్స్ సర్వీసు అందుబాటులోకి తెచ్చిన స్విగ్గీ ప్రస్తుతం ఢిల్లీ, హైద‌రాబాద్‌, ముంబై, పుణె, కోల్‌క‌తా న‌గ‌రాల్లో సేవలను విస్తరించింది. అవసరానికి అనుగుణంగా మిగతా ప్రాంతాల్లోనూ అంబులెన్స్ సర్వీసులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పింది. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు ఫోన్ చేసిన 12 నిమిషాల్లో అంబులెన్స్ ఫెసిలిటీ ల‌భిస్తుంద‌ని స్విగ్గీ వెల్లడించింది. ఉద్యోగితో పాటు భార్య, ఇద్దరు పిల్లలకు ఈ సర్వీసు ఉచితంగా లభించనుంది. ఒకవేళ ఇతర కుటుంబసభ్యుల కోసం అంబులెన్స్ అవసరమైతే తక్కువ రేటుకే సర్వీసును పొందవచ్చు.