స్విగ్గీలో డ్రగ్స్ డెలివరీ?.. అడ్డంగా బుక్కయిన డెలివరీ బాయ్

స్విగ్గీలో డ్రగ్స్ డెలివరీ?..  అడ్డంగా బుక్కయిన డెలివరీ బాయ్

హైదరాబాద్​: సిటీలో డ్రగ్స్​అమ్మడానికి వచ్చిన స్విగ్గీ డెలివరీ బాయ్ ని  సైబరాబాద్  ఎస్వోటీ  పోలీసులు అరెస్ట్​  చేశారు. మురళీధరన్ అనే వ్యక్తి బెంగళూర్ లో స్విగ్గీ బాయ్ గా పనిచేస్తున్నాడు.  ఈ క్రమంతో హైదరాబాద్ లోని కస్టమర్లకు ఎండీఎంఏ డ్రగ్​ను అమ్మడానికి వచ్చి శంషాబాద్ వచ్చాడు.  ఆర్జీఐ పీఎస్​ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతుంటే అతడిని ఎస్వోటీ , ఆర్జీఐ పోలీసులు పట్టుకుని సోదా చేశారు. అతని ప్యాంటు ఇన్నర్ జేబులో 11 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను​దొరికింది. ఎండీఎంఏ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని ఆర్జీఐ పోలీసులు  విచారణ చేస్తున్నారు.