పాక్​ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన మునీర్

పాక్​ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన మునీర్

ఇస్లామాబాద్: పాకిస్తాన్​ మాజీ స్పై మాస్టర్ జనరల్ అసీమ్ మునీర్ ఆ దేశ 17వ ఆర్మీ చీఫ్​ గా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఖమర్ జావేద్​ భజ్వా రిటైర్ కావడంతో ఆ స్థానాన్ని జనరల్ మునీర్ భర్తీ చేశారు. జనరల్ హెడ్​క్వార్టర్స్ (జీహెచ్​క్యూ)లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ఆర్మీ సీనియర్ అధికారులు, డిప్లొమాట్స్​ తో పాటు రాజకీయ పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జనరల్​ భజ్వా మాట్లాడారు. దేశ రక్షణ బాధ్యతలు సేఫ్​ గా ఆర్మీ కమాండ్​ చేతుల్లో పెడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. 

తర్వాత భజ్వా.. జనరల్​ మునీర్​ కు బ్యాటన్​ను అందజేశారు. నవంబర్​ 24న ప్రధాని షెహబాజ్​ షరీఫ్ ఆర్మీ చీఫ్​ పోస్టుకు మునీర్​ పేరును నామినేట్ చేశారు. ఇంటర్​ సర్వీసెస్​ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), మిలటరీ ఇంటెలిజెన్స్ (ఎంఐ)కు జనరల్​ ఆసిమ్ మునీర్ చీఫ్​ గా వ్యవహరించారు. ఎంతో అనుభవం ఉన్న ఆఫీసర్​ గా పేరుంది. 2018 అక్టోబర్‌‌లో ఐఎస్ఐ చీఫ్‌‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 8 నెలల్లోనే ఆయనను ఐఎస్ఐ చీఫ్ పదవి నుంచి తప్పించారు. తనకు అత్యంత సన్నిహితుడైన లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌‌ను కొత్త చీఫ్‌‌గా నియమించారు. దీనికి ముందు ఆసిమ్​ మునీర్ ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్‌‌లో పనిచేశారు. మాజీ ఆర్మీ చీఫ్​ ఖమర్​ జావేద్ భజ్వాకు అత్యంత సన్నిహితుడు.