సైరా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు

సైరా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు

స్వాతంత్ర్య సమరయోధుడి జీవిత కథ ఆధారంగా వస్తున్న సైరా నర్సింహారెడ్డి చిత్రంపై గత కొన్నిరోజుల నుంచి ఓ వివాదం నడుస్తోంది. ఈ సినిమా విషయంలో డైరెక్టర్, ప్రొడ్యూసర్ మోసం చేశారంటూ నర్సింహరెడ్డి వంశస్తులు కోర్టులో కేసు వేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు నిజానిజాలు పరిశీలించి చిత్రాన్ని విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సైరా సినిమాను మొదట బయోపిక్ అని,  ఆ తర్వాత  చరిత్రను తప్పుదోవ పట్టిస్తూ సినిమాను చిత్రీకరించారని పిటిషన్ దాఖలైంది. తమిళనాడు తెలుగు యువ సంఘం నాయకులు కేతి రెడ్డి ఈ పిటీషన్ ను దాఖలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సైరా చిత్రం లో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. సినిమా ను కేవలం వినోద పరంగానే చూడాలని చెప్పింది. ఎంతో మంది మహానుభావుల చరిత్రను కూడా ఉన్నది ఉన్నట్టు ఎవ్వరు చూపించరని, కల్పిత పాత్రలతో, కథలతో చిత్రీకరిస్తానని చెప్పింది. గతంలో గాంధీజీ, మొగల్ ల సామ్రాజ్యాలపై తెరకెక్కించిన చిత్రాలు కూడా కేవలం కల్పితాలేనని తెలిపింది. అయితే సినిమా నచ్చేది, నచ్చనిది ప్రేక్షకులకు  వదిలేయాలని, ఇప్పుడు సినిమా విడుదలను అపలేమని..  సినిమాపై దాఖలైన పిటిషన్ ను కొట్టేసింది హైకోర్టు.