పిల్లల్లో సింప్టమ్స్ తగ్గినా.. 3 వారాల వరకూ కరోనా

పిల్లల్లో సింప్టమ్స్ తగ్గినా.. 3 వారాల వరకూ కరోనా

కరోనా వచ్చి తగ్గిపోయిన  పిల్లల్లో మూడు వారాల వరకూ వైరస్ కణాలు ఉంటున్నట్లు సౌత్ కొరియాలో జరిగిన ఓ రీసెర్చ్ లో వెల్లడైంది. ఎలాంటి సింప్టమ్స్ లేకుండా వైరస్ పాజిటివ్ వచ్చిన చిన్నారుల్లోనూ  వైరస్ ఆర్ఎన్ఏ అవశేషాలు ఇంతకు ముందు అంచనా వేసిన దానికంటే ఎక్కువ కాలం ఉంటున్న ట్లు తేలింది. పిల్లల ద్వారా కూడా వైరస్ ఇతరులకు వ్యాపించే చాన్స్ ఎక్కువే ఉన్నట్లు ఈ రీసెర్చ్ ద్వారా తేలిందని సియోల్ నేషనల్ యూనివర్సిటీ సైంటిస్టులు వెల్లడించారు. సౌత్ కొరియాలోని 22 హాస్పిటళ్లలో కరోనా ట్రీట్ మెంట్ తీసుకున్న91మంది పిల్లలపై ఈ రీసెర్చ్ జరిగింది. పిల్లల్లో కరోనాపై ఇప్పటి వరకూ పెద్దగా స్ట్రెస్ ఏమీ జరగలేదని, వారిలో సింప్టమ్స్, వైరస్ కణాలుఎన్ని రోజులవరకు ఉంటాయి?అన్నది అంతగా తెలియలేదని సైంటిస్టులు పేర్కొంటున్నారు. పిల్లల్లో కరోనా కేసులను గుర్తించడంలో  సింప్టమ్స్ స్కానింగ్ టెస్టులు చాలాసార్లు ఫెయిల్ అవుతున్నాయని వారు తెలిపారు. కరోనా వ్యాప్తిలో పిల్లల పాత్ర కూడా ఎక్కువే ఉందని ఈ రీసెర్చ్ ను బట్టి తెలుస్తోందని అమెరికాలోని జార్జి వాషింగ్టన్ వర్సిటీ సైంటిస్ట్ రాబర్టా ఎల్. డెబియాసీ అభిప్రాయపడ్డారు. పిల్లల్లో అసింప్ట మాటిక్ కరోనా ఇన్ఫెక్షన్, సింప్టమ్స్ ఎన్నిరోజులుంటాయి? చిన్నారుల్లో వైరస్ ఎంత కాలం ఉంటుంది? అన్నవాటిపై ఇంతకుముందు రీసెర్చ్ లేమీ జరగలేదన్నారు.

సగం మందిలో 3 వారాల వరకూ వైరస్..

‘‘రీసెర్చ్ లో మానిటర్ చేసిన పిల్లల్లో 22 శాతం మందికిఎలాంటిసింప్టమ్స్ కనిపించలేదు.20శాతం చిన్నారులకుమొదట్లో సింప్టమ్స్ బయటపడలేదు.58 శాతం మందికితొలిదశలోసింప్టమ్స్ కనిపించాయి. వీరందరికీ ప్రతి మూడు రోజులకోసారి టెస్టులు చేశాం. దీంతో పిల్లల్లో మూడురోజుల నుంచిమూడు వారాలవరకూ వైరస్ ఆర్ఎన్ఏఉన్నట్లు తేలింది.వీరి ద్వారా వైరస్ ఇతరులకు ఇన్ఫెక్ట్ అయ్యే చాన్స్ కూడా ఉన్నట్లు ప్రూవ్ అయింది’’ అని సౌత్ కొరియా సైంటి స్టులు పేర్కొన్నారు. మొత్తంగా సగం మంది పిల్లల్లో మూడు వారాల వరకూ వైరస్ ఆనవాళ్లు కనిపించా యనితెలిపారు.అయితే,కరోనాతగ్గినగ్గి తర్వతా కూడా పాజిటివ్వచ్చిన పిల్లల్లో వైరస్ జెనెటికల్ మె టీరియల్ ఆనవాళ్లు ఉండొచ్చని, వాటితో ఇతరులకు ఇన్ఫెక్షన్ సోకే చాన్స్ ఉండకపోవచ్చని సైంటిస్టులు చెప్పారు. అలాగే నెగెటివ్ వచ్చిన పిల్లల్లోనూ వైరస్ లో లెవల్‌లో ఉండొచ్చని,వారి ద్వారా ఇతరులకు వైరస్ సోకే చాన్స్ ఉండవచ్చని పేర్కొన్నారు.