ప్రఖ్యాత సిరియన్ హెయిర్‌స్టైలిస్ట్ డానీ హిస్వానీ అత్యున్నత హెయిర్‌స్టైల్గిస్ట్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. మిస్టర్ హిస్వానీ ఈ ఏడాది సెప్టెంబర్ 16న దుబాయ్, UAEలో 2.90 మీటర్ల (9 అడుగుల 6.5 అంగుళాలు) ఎత్తులో క్రిస్మస్ చెట్టు ఆకారంలో ఓ మహిళ జుట్టును అందంగా అలంకరించారు. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో ఓ మహిళ హెల్మెట్ ధరించి ఉండగా.. పక్కనే ఉన్న డాని హిస్వానీ ఆమె తలపై హెల్మెట్ పెట్టి... దానిపై క్రిస్మస్ ట్రీని రూపొందించారు. దీన్ని రూపొందించేందుకు, ఎత్తుగా వచ్చేందుకు చాలా విగ్గులను ఉపయోగించారు. దాంతో పాటు ఈ హెయిర్ స్టైల్ ను చిన్న చిన్న బంతులతో క్రిస్మస్ ట్రీ లాగా అలంకరించడం అందర్నీ ఆకర్షిస్తోంది.
ఏడేళ్ల క్రితమే ఫ్యాషన్ ఫీల్డ్ లోకి వచ్చిన డానీ.. ఈ రోజు తన అద్భుతమైన హెయిర్ స్టైల్ టాలెంట్ తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. డానీ గతంలోనూ ఇలాంటి క్రిస్మన్ చెట్టు ఆకారంలో ఉండే హెయిర్ స్టైల్ ను రూపొందించారు. తన రికార్డును తానే బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో ఈ సారి మరింత ఎత్తులో ఉండే హెయిర్ స్టైల్ ను చేసి ఏకంగా గిన్నిస్ రికార్డులో స్థానం సాధించారు. అయితే ఇదేమంత రికార్డు సాధించాల్సిన విషయం కాదని కొందరు నెటిజన్లు వాపోతున్నారు. నిజమైన జుట్టైతే పర్లేదు.. కానీ ఇలా హెల్మెట్ పెట్టి హెయిర్ స్టైల్ రూపొందించడం అంత చెప్పుకోదగినమేం కాదని ఆరోపిస్తున్నారు. మరికొందరమో ఇది కేశాలంకరణ కాదు.. శిరో భూషణం అంటూ కామెంట్ చేస్తు్న్నారు.
