వెస్టిండీస్ చేతిలో చిత్తు.. టీ20 వరల్డ్ కప్ నుంచి న్యూజిలాండ్ ఔట్

వెస్టిండీస్ చేతిలో  చిత్తు..  టీ20 వరల్డ్ కప్ నుంచి న్యూజిలాండ్ ఔట్

టీ20 వరల్డ్ కప్ నుంచి న్యూజిలాండ్ ఇంటి దారిపట్టింది. ఆ జట్టు ఇప్పటి  వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడి గ్రూప్ సీలో పాయింట్ల పట్టికలో చివరలో ఉంది. ఇంకా మరో రెండు నామమాత్రపు  మ్యాచులు ఆడాల్సి ఉంది. 

అయితే ఇదే గ్రూప్ లో  వెస్టిండీస్,అప్గనిస్తాన్ చెరో 6 పాయింట్లతో సూపర్ 8కు చేరుకున్నాయి. కివీస్ తో పాటు ఉగాండా,పాపువా, న్యూగినియా టీంలు వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. 

టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో‌‌‌‌‌‌‌  నిన్న జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌కు ఊహించని షాకిచ్చింది  వెస్టిండీస్‌. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో షెర్ఫానే రూథర్‌‌‌‌‌‌‌‌ఫోర్డ్‌‌‌‌‌‌‌‌ (39 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 6 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 68 నాటౌట్‌‌‌‌‌‌‌‌), బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో అల్జారీ జోసెఫ్‌‌‌‌‌‌‌‌ (4/19), గుడకేశ్‌‌‌‌‌‌‌‌ మోతీ (3/25) చెలరేగడంతో.. గురువారం జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌–సి లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో విండీస్‌‌‌‌‌‌‌‌ 13 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో కివీస్‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. దీంతో హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ విజయాలతో కరీబియన్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–8కు అర్హత సాధించగా కివీస్‌ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.

 టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన విండీస్‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో 149/9  స్కోరు చేసింది. తర్వాత న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో 136/9 స్కోరుకే పరిమితమైంది. గ్లెన్‌‌‌‌‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌ (33 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 40) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. ఫిన్‌‌‌‌‌‌‌‌ అలెన్‌‌‌‌‌‌‌‌ (22), సాంట్నెర్‌‌‌‌‌‌‌‌ (21 నాటౌట్‌‌‌‌‌‌‌‌) పోరాడి విఫలమయ్యారు. రూథర్‌‌‌‌‌‌‌‌ఫోర్డ్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది.